Amaravati : మద్రాస్ నుంచి ఆంధ్రరాష్ట్ర సాధన కోసం అమరణదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవీ పొట్టిశ్రీరాములు కు నివాళిగా ఈ నెల 16న అమరావతిలో భారీ కాంస్య విగ్రహం(Statue of Sacrifice) ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరు పార్కులో శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ చేయనున్నారు. తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా, 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(nara chandrababu naidu), ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(minister nara lokesh). బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ తదితరులు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు(Potti Sreeramulu) మెమోరియల్ పార్క్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/03/15/statue-of-sacrifice-2026-03-15-12-22-16.jpg)
A Symbol Of Self-Respect In Amaravati
కాగా, పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించినట్లు నిర్వహకులు తెలిపారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఎత్తులో “త్యాగ విగ్రహం”గా ఈ కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు గత ఏడాది సెప్టెంబర్ 3న మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కేవలం ఆరు నెలల వ్యవధిలో విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తుళ్ళూరు–పెడపరిమి రహదారిపై ఉన్న శాఖమూరు పార్కులో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, సామాజిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తరతరాలకు గుర్తు చేసేలా అమరావతిలో ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడం చారిత్రాత్మక ఘట్టమని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
#andhra-pradesh-news #telugu-news #latest-telugu-news #Statue of Sacrifice #Amaravati Capital #Potti Sreeramulu #nara chandrababu naidu #minister nara lokesh #amaravati #Pawan Kalyan









