Home > Blog > వీసా కోసం వింత డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్!

వీసా కోసం వింత డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్!

అమెరికాలో స్థిరపడాలనే ఆశతో అడ్డదారులు తొక్కిన 11 మంది భారతీయుల బాగోతం బయటపడింది. ‘యు-వీసా’ పొందేందుకు ఏకంగా దొంగతనాలనే డ్రామా ఆడి, చివరికి FBI చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు.

అమెరికా వీసా కోసం వింత డ్రామా

అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి వీలు కల్పించే ‘యు-వీసా’ దక్కించుకోవడం కోసం కొంతమంది భారతీయులు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. నిబంధనల ప్రకారం వీసా రాదని తెలిసి, తాము నేర బాధితులమని నిరూపించుకుంటే సులభంగా వీసా వస్తుందనే అడ్డదారిని వీరు ఎంచుకున్నారు.

ఏమిటీ కుట్ర?

సాధారణంగా అమెరికాలో ఏదైనా హింసాత్మక నేరానికి లేదా దోపిడీకి గురై, పోలీసుల విచారణకు సహకరించే బాధితులకు మానవతా దృక్పథంతో ‘U Non-immigrant Status’ (U Visa) మంజూరు చేస్తారు. దీనిని ఆసరాగా చేసుకున్న రాంభాయ్ పటేల్ అనే వ్యక్తి నేతృత్వంలోని ముఠా, నకిలీ దోపిడీలను ప్లాన్ చేసింది. వీరు కొన్ని మద్యం దుకాణాలు, రెస్టారెంట్ యజమానులకు డబ్బులు ఇచ్చి, వారి షాపుల్లో దొంగతనం జరిగినట్లు సీన్ క్రియేట్ చేసేవారు. వీసా కావాల్సిన వ్యక్తులు ఈ ముఠాకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి, ఆ సమయంలో షాపులో పని చేస్తున్నట్లు లేదా అక్కడ ఉన్నట్లు నటించేవారు.

Leave a Reply