Home > స్పోర్ట్స్ > Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌కు బిగ్‌షాక్.. భారీ ఫైన్ విధించిన ICC

Arshdeep Singh: అర్ష్‌దీప్‌ సింగ్‌కు బిగ్‌షాక్.. భారీ ఫైన్ విధించిన ICC

భారత పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ అతడిపై భారీ ఫైన్ విధించింది. ఆదివారం జరిగిన టీ 20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌలింగ్ వేసేటప్పుడు న్యూజిలాండ్ బ్యాటర్‌ డారిల్ మిచెల్‌పై అర్ష్‌దీప్‌ బంతి విసిరిన సంగతి తెలిసిందే. ఇలా అనుచితంగా బాల్ విసిరినందుకు ఐసీసీ చర్యలకు దిగింది. మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఐసీసీ కోడ్‌ ఉల్లంఘించినందుకు ఫైన్‌తో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా విధించింది. 

Also Read: గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు పడే డేట్ వచ్చేసింది!

అసలు ఏం జరిగింది ?

 ఫైనల్ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌లో అర్ష్‌దీప్‌ 11వ ఓవర్‌లో బౌలింగ్‌ వేయగా.. డారిల్ మిచెల్ వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. కాస్త అసహనం వ్యక్తం చేసిన అర్ష్‌దీప్.. మరో బాల్‌కు మిచెల్‌పై నేరుగా బాల్ విసిరాడు. దీంతో మిచెల్ కోపంతో ఊగిపోయాడు. ఏంటి అన్నట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానీ అర్ష్‌దీప్‌ మాత్రం అతడిని పట్టించుకోకుండా వెనక్కి వచ్చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్య వెళ్లి మిచెల్‌కు సర్దిచెప్పాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్‌కు అంపైర్ కూడా నచ్చజెప్పగా దీంతో అతడు సారీ అన్నట్లు సైగలు చేశాడు.  

Leave a Reply