వేసవి కాలం.. ఈ సీజన్ లో విపరీతమైన వేడితో పాటు దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇవి నిద్రకు భంగం కలిగించడమే కాకుండా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. దీంతో దోమలను తరిమికొట్టడానికి చాలా మంది కాయిల్స్, కెమికల్ స్ప్రేలు వంటి అనేక రకమైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయితే వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీని వల్ల శ్వాసకోస సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వీటికి ప్రత్యమ్నాయంగా ఇంట్లోనే కొన్ని వస్తువులతో ఎలాంటి ప్రమాదం లేకుండా దోమలను తరిమికొట్టొచ్చని అంటున్నారు. అవేంటో చూసేద్దాం.
వెల్లుల్లి స్ప్రేతో చెక్
దోమలకు చెక్ పెట్టేందుకు వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో దోమలు ఇష్టపడని వాసన ఉండే సహజ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల వెల్లుల్లిని నీటిలో మరిగించి వెల్లుల్లి స్ప్రే తయారు చేసుకోవచ్చు. అది చల్లబడిన తర్వాత కిటికీలు, మొక్కలు లేదా బయట ప్రదేశాలపై చల్లుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దోమలను చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు.
నూనెలతో దోమలకు చెక్
కొన్ని నూనెలు దోమలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. దోమలకు నిమ్మగడ్డి నూనె, యూకలిప్టస్ నూనె, టీ ట్రీ నూనెలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల మీరు ఈ నూనెలను నీటితో కలిపి మీ రూమ్ లో స్ప్రే చేయవచ్చు.
వేప ఆకులతో పొగ
దోమల సమస్యకు చెక్ పెట్టేందుకు వేపాకులు ఎంతగానో సహాయపడతాయి. పురాతన కాలంలో దోమలను తరిమికొట్టడానికి ప్రజలు ఎండిన వేప ఆకులను పొగబెట్టేవారు. ఈ పొగ నుంచి వచ్చే వాసనకు దోమలు దరికి చేరవు.
కిటికీలు, తలుపులకు మెష్
వేసవి కాలంలో దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధించడానికి కిటికీలు, తలుపులకు ఫైన్ మెష్ అమర్చడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల స్వచ్ఛమైన గాలి లోపలికి రావడమే కాకుండా దోమల సమస్యకు చెక్ పెడుతుంది.
దోమలను తిప్పికొట్టే మొక్కలు
దోమలకి కొన్ని మొక్కల వాసన నచ్చదు. అందులో సిట్రోనెల్లా, తులసి, లావెండర్, పుదీనా ఉన్నాయి. ఈ మొక్కలు దోమలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.
ఇంటి చుట్టూ నీరు నిల్వ లేకుండా చూడాలి
దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న నీటిలోనే వృద్ధి చెందుతాయి. అందువల్ల ఇంటి చుట్టూ నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. కుండలు, బకెట్లు, కూలర్లు, డ్రెయిన్లలో నీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
#mosquito coil side effects #mosquito coils #mosquito coil facts #mosquito-bites #summer-tips #health-care-tips
